న్యూ ఢిల్లీ: ‘అసోం సోదర, సోదరీ మణులు మీ భరోసా ట్వీట్ ను చదవ లేరు. వారికి అంతర్జా సేవల్ని నిలిపేసారు. బహుశా ఈ వాస్త వాన్ని మీరు మరిచిపోయి ఉండవచ్చ’ని ట్విట్టర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీని గురువారం ఎద్దేవా చేసింది. పౌర సత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా అసోంలో భారీ ఎత్తున ఆందోళనలు జరుగు తున్నాయి. అంతర్జాల సేవలను నిలిపే సారు. గౌహతిలో కర్ఫ్యూ విధించారు. దరి మిలా పౌరసత్వచట్ట సవరణపై అసోం సోదర, సోదరీ మణులు ఆందో ళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ చేసిన ట్వీట్ను కాంగ్రెస్ అలా ఎగతాళి చేసింది.