వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికిన అస్సాం ప్రభుత్వం

వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికిన అస్సాం ప్రభుత్వం

గౌహతి : వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతూ అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. జులై నుంచి రాష్ట్రంలోని ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు తమ విద్యుత్ బిల్లులను సొంత డబ్బుతోనే చెల్లించుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. తాను, ప్రధాన కార్యదర్శి జులై 1వ తేదీ నుంచి తమ విద్యుత్ బిల్లులను తామే చెల్లిస్తామని ప్రకటించారు. ‘ప్రజలు చెల్లించే టాక్స్తో ప్రభుత్వ అధికారులకు విద్యుత్ బిల్లులు చెల్లించే వీఐపీ సంస్కృతికి ముగింపు పలుకుతున్నాం. నేను, ప్రభుత్వ కార్యదర్శి మా విద్యుత్ బిల్లులను జులై 1వ తేదీ నుంచి మేమే చెల్లిస్తాం. ఇలాగే జులై 2024 నుంచి ప్రభుత్వ ఉద్యోగులంతా తమ విద్యుత్ బిల్లులను వారే చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos