హైదరాబాద్: ‘ఉద్యోగాల నుంచి తొలగించినట్లు మాకు ఇంకా తాఖీదులు రాలేదు. వస్తే స్పందిస్తామ’ని ఆర్టీసి కార్మిక సంఘాల ఐకాస ఛైర్మన్ అశ్వ త్థామ రెడ్డి గురువారం ఇక్కడ తెలిపారు. న్యాయస్థానంలో తమ వాదనల్ని వినిపించామని చెప్పారు. సాయంత్రం నాలుగు 4 గంటల తర్వాత భవి ష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ‘కార్మికుల ఉద్యోగాలకు ముప్పు లేదు. అందరూ ధైర్యంగా ఉంటూ ఇదే స్ఫూర్తితో సమ్మెను కొనసా గిం చాల’ని పిలుపు నిచ్చారు. సమ్మెలు ఉద్యమాలను అణచి వేసే ప్రయత్నం చేసిన ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందులు తప్పవ’ని హెచ్చరించారు. కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపి సమ్మె నివారణకు ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేం దుకే తాము ప్రయత్నిస్తున్నామని వివరించారు. యాజమాన్యం కఠిన వైఖరే సమ్మెకు దారి తీసిందని చెప్పారు. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతి స్తున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటి కైనా వాస్తవాలు గ్రహించి తమ న్యాయమైన కొర్కెలు పరిష్కరించాలని డిమాండు చేసారు. తమ వాదనల్ని విన్న ఉన్నత న్యాయ స్థానం విచారణను ఈ నెల 15కు వాయిదా వేసిందని చెప్పారు.