టెహ్రాన్: ట్రంప్ ఆస్తులను భస్మీపటలం చేస్తామని ఇరాన్ అధ్యక్షుడి సలహాదారు హెసమిద్దీన్ ఆష్నా మంగళవారం ట్వీట్ లో హెచ్చరిం చారు. ఇరాన్లో 52చోట్ల దాడులు చేస్తామని ట్రంప్ చేసిన ట్వీట్కు ఘాటుగా బదులిచ్చారు. ‘మాకు అమెరికా ప్రజలతో అసలు సమస్యే లేదు. అక్కడి గత ప్రభుత్వాలతో మేము అనేక ఒప్పందాలు కూడా చేసుకున్నాం. మా ఏకైక సమస్య వారి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. అలాంటప్పుడు రెండు దేశాల మధ్యా యుద్ధం వస్తే దానికి ఆయనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంద’న్నారు. మరో ట్వీట్లో ట్రంప్ ఆస్తుల పట్టికను ఇచ్చారు. అమెరికా దాడులు చేస్తే, తాము చేతులు ముడుచుకు కూర్చోబోమని, ట్రంప్ ఆస్తులను భస్మీపటలం చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు.