పాలకుల కళ్లు, చెవులూ మూసుకు పోయాయి

పాలకుల కళ్లు, చెవులూ మూసుకు పోయాయి

న్యూ ఢిల్లీ : గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు(ఆశ) తమ దయనీయ పరిస్థితులపై రోడ్డెక్కాల్సిరావడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆక్రోశించారు. ‘కేంద్రం ఇప్పటి వరకు మ్యూట్ లోకి మాత్రమే వెళ్లిందనుకున్నాం. ఇప్పుడు ఏకంగా కళ్లూ, చెవులూ పని చేయడం లేదు. దేశ వ్యాప్తంగా ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పిస్తున్నారు. వాళ్లు నిజమైన ఆరోగ్య యోధులు. ఇప్పుడు తమ కనీస హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింద’ని ట్వీట్ చేశారు. ఆశ వర్కర్లు, అంగన్వాడీ, జాతీయ ఆరోగ్య మిషన్ సిబ్బంది తమకు కనీస వసతులు, ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి రెండ్రోజుల పాటు సమ్మె చేపట్టనున్నట్టు వచ్చిన ఒక వార్తనూ జత పరిచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos