సంచలన వ్యాఖ్యలకు కేంద్రబిందువైన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డికి సూచనలు చేస్తున్నట్లుగా ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగరంలోని తీవ్రవాదులకు చట్టపరమైన సాయం అందిస్తానంటూ గతంలో తనతో ఒక ఎమ్మెల్యే చెప్పారని సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ కిషన్‌రెడ్డికి విన్నవించారు.పాతబస్తీలో దాక్కున్న శత్రుదేశానికి మద్దతు పలుకుతున్న ఉగ్రవాదులను ఏరివేయాలంటూ కోరారు.రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీని ఉద్దేశించి చేసినవేనని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.కాగా ఓవైసీ సైతం తరచూ సంచలన వ్యాఖ్యలు చేసే నేతే కావడంతో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు ఓవైసీ ఎలా స్పందిస్తాడోనని ఉత్కంఠ నెలకొంది.కాగా 2024లో జరిగే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానంపై బీజేపీ జెండా ఎగరాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ కారణంగా ఈ తరహా సంచలన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో మరిన్ని రావటం ఖాయం.