లోక్‌సభ ఎన్నికలకు
నామినేషన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడంతో హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం
తరపున అభ్యర్థిగా బరిలో దిగనున్న అసదుద్దిన్ ఓవైసీ ఎన్నికల కమిషన్‌కు నామినేషన్ పత్రాలు
దాఖలు చేశారు.నామినేషన్‌తో పాటు తన స్థిరచరాస్తులు,అప్పులు,ఆభరణాలు తదితర అన్ని ఆస్తుల
వివరాలను అఫడవిట్‌లో పొందుపరిచారు.తన మొత్తం ఆస్తుల విలువ రూ.13 కోట్లుగా అసదుద్దిన్
పేర్కొన్నారు.నిరర్థక ఆస్తులు విలువ రూ.12 కోట్లు,లిక్విడ్ ఆస్తులు రూ.1.67 కోట్లుగా
చూపించారు.తన భార్య ఫర్హీన్ ఓవైసీ పేరుతో రూ.3.75 కోట్ల నిరర్థక ఆస్తులు ఉండగా రూ.10.40లక్షల
లిక్విడ్ ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.ఇక తనకు మొత్తం రూ.9.30 కోట్ల అప్పులు ఉన్నాయని
అందులో రూ.5 కోట్లు తన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ నుంచి అప్పుగా తీసుకున్నానని అదేవిధంగా
తన భార్య ఫర్హీన్ ఓవైసీకి రూ.1.20 కోట్లు అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు.2017-18 సంవత్సరానికి
గానూ రూ.10లక్షల ఆదాయం చూపించారు.ఇక తన వద్ద పాయింట్ 22 పిస్టల్,ఎస్‌పీ బోర్
30-60 రైఫిల్స్ ఉన్నాయని ఈ రెండు ఆయుధాల విలు రూ.2లక్షలు కాగా చేతిలో రూ.2లక్షల నగదు,బ్యాంకులో
రూ.43లక్షల డిపాజిట్లు,తన భార్యకు రూ.6.40లోల విలువ చేసే 20 తులాల బంగారు ఆభరణాలు,బ్యాంకులో
రూ.1లక్ష నగదు ఉన్నట్లు అఫడవిట్‌లో చూపారు.అన్నటికంటే ఆశ్చర్యకరంగా తనకు సొంత కారు
కూడా లేదంటూ అఫడవిట్‌లో పేర్కొన్నారు అసదుద్దిన్ ఓవైసీ..