అరుంధతి-2 కథానాయిక

  • In Film
  • June 21, 2019
  • 149 Views
అరుంధతి-2 కథానాయిక

హైదరాబాద్‌ : అనుష్క కథానాయికగా వచ్చిన అరుంధతి సినిమాకు సీక్వెల్‌గా అరుంధతి-2 సినిమా రాబోతోంది. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది. శ్రీ శంఖు చక్ర ఫిల్మ్స్‌ పతాకంపై కోటి తూముల నిర్మిస్తున్నారు. ఆర్‌ఎక్స్‌ 100 కథానాయిక పాయల్‌ రాజ్‌పుత్‌. భారీ బడ్జెట్‌, గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నామని కోటి తూముల చెప్పారు. బాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు కూడా ఇందులో నటించనున్నారని వెల్లడించారు. ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌ హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు అందించనున్నారు. సినిమాలో తన పాత్రకు అవసరమైన గుర్రపు స్వారీ, కత్తి సాముల్లో పాయల్‌ రాజ్‌పుత్‌ శిక్షణ తీసుకుంటున్నారు. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నామని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని కోటి తూముల తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos