హైదరాబాద్: తెలంగాణలో మద్య నిషేధాన్ని డిమాండ్ చేస్తూ భాజపా నేత, మాజీ మంత్రి డీకే.అరుణ ఇక్కడి ఇందిరా పార్క్ వద్ద -మహిళా సంకల్ప దీక్ష’ పేరిట నిరసన చేపట్టారు. భాజపా మహిళా మోర్చా, ఇతర నేతలు లక్ష్మణ్, రామచంద్ర రావు, ఇతర నాయకులు మద్దతు తెలిపారు. మహిళలు, విద్యార్థినులు భారీగా హాజరయ్యారు.