అమరావతి: రాష్ట్ర రహదారి రవాణా సంస్థ పొరుగు సేవల సిబ్బంది 7,600 మందికి ఏప్రిల్ నెల వేతర బకాయిల్ని చెల్లించాలని సంస్థ కార్య నిర్వాహక సంచాలకుడు మాదిరెడ్డి ప్రతాప్ శనివారం ఇక్కడ ఉత్తర్వుల్ని జారీ చేసారు. వేతనం మొత్తంలో 90 శాతం మాత్రమే చెల్లిస్తారు. అయినా ఉద్యోగులు సంతోషించారు. బస్సు ప్రయాణ రాయితీల్ని పాత్రికీయులు మినహాయించి ఇతరులకు తాత్కాలికంగా నిలిపి వేసినట్లు అధికార్లు తెలిపారు.