న్యూ ఢిల్లీ : పదాతి దళ కేంద్ర కార్యాలయ సిబ్బంది పునర్వ్యవ స్థీకరణకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం ఆమో దించారు. సైనిక బలగాల పునర్వ్యవస్థీకరణ, పారదర్శకత ఈ చర్యలు తీసుకున్నారు. స్వాతంత్య్రానంతరం పదాతి దళంలో చేపట్టిన అతి పెద్ద కసరత్తుగా భావిస్తున్నారు. చీఫ్ ఆర్మీ స్టాఫ్ (సిఓఎఎస్) పరిధిలో త్రివిధ దళాల ప్రాతినిధ్యంతో ప్రత్యేక విజిలెన్స్ సెల్, మానవ హక్కుల సమస్యలపై దృష్టి పెంచేందుకు వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీస్టాఫ్ (విసిఓఎఎస్)ఆధీనంలో ఒక సంస్ధను ఏర్పాటు చేస్తారు. 206 మంది సైనికాధికారులను పదాతి దళ ప్రధాన కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయి యూనిట్లకు తరలిస్తారు. ప్రస్తుతం సిఓఎస్ కోసం బహుళ సంస్ధలతో నిఘా వ్యవస్థ ఉంది. దీనికి బదులుగా ఒక స్వతంత్ర నిఘా విభాగం ఏర్పడుతుంది. ఇందు కోసం ఎడిజి (విజిలెన్స్)ను నేరుగా సిఓఎఎస్ ఆధీనంలోకి తెస్తారు. ఒక్కోదళానికి ఒక్కరు వంతున ముగ్గురు కల్నల్ స్థాయి అధికారులు ఉంటారు. ఇంకా పలు ఇతర నిర్ణయాలు తీసుకున్నారు.