ఎర్రమంజిల్ కూల్చివేతపై పురావస్తు శాఖ ఆగ్రహం..

ఎర్రమంజిల్ కూల్చివేతపై పురావస్తు శాఖ ఆగ్రహం..

కొత్త సచివాలయం,శాసనసభ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలపై రోజురోజుకు నిరసనలు,వ్యతిరేకత తీవ్రరూపం దాల్చుతున్నాయి.విపక్షాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు,ప్రజలు చివరకు కేంద్ర పురవాస్తు శాఖ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇంకా ఐదారు దశాబ్దాలైనా చెక్కు చెదరకుండా ఉండేవిధంగా ఉన్న ప్రస్తుత సచివాలయాన్ని కూల్చేసి వందల కోట్ల రూపాయల వ్యయంతో కొత్త సచివాలయం నిర్మాణానికి కేసీఆర్‌ నిర్ణయించుకోవడంపై విపక్షాలు,స్వచ్ఛంద సంస్థలు,ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.ఈ తరుణంలోనే కొత్త శాసనసభను నిర్మించాలని తీర్మానించుకున్న కేసీఆర్‌ అందుకోసం పురాతన కట్టడమైన ఎర్రమంజిల్‌ కట్టడాన్ని కూల్చేసి ఆ స్థానంలో కొత్త శాసనసభ భవనాన్ని నిర్మించడానికి నిర్ణయించుకున్నారు.ఈ నిర్ణయంపై విపక్షాలు,స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.కొత్త శాసనసభ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ కూల్చివేతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలు రాజకీయ పార్టీలతోపాటు స్వచ్ఛంధ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ఓ చారిత్రక భవనం కూల్చివేతకు సంబంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే కీలక పాత్ర పోషించాల్సిన రాష్ట్ర పురావస్తు శాఖపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖకు పలువురు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులను పరిశీలించిన కేంద్రం సాంస్కృతిక శాఖ రాష్ట్ర పురావస్తు శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎర్రమంజిల్ పై రాద్ధాంతం జరుగుతున్నా తమకు సంబంధం లేదన్నట్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ పురావస్తు శాఖ అధికారులకు అక్షింతలు వేసింది.ఇకనైనాప్రేక్షక పాత్రకు స్వస్తి పలికి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర ఆదేశాలతో రాష్ట్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఎర్ర మంజిల్‌ను సందర్శించి భవనం పటిష్ఠతపై వివరాలు సేకరించారు.ఇదే అంశంపై చారిత్రక భవనాల పరిరక్షణకు కృషిచేస్తున్న ఇన్‌ట్యాక్‌ సంస్థ ప్రతినిధులు కూడా ఎర్ర మంజిల్‌ను సందర్శించారు. భవనం పటిష్టతతో పాటు భవనం కూల్చివేయకుండా ప్రభుత్వం అవలంబించగలిగే ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న స్థలం, పరిసరాలను పరిశీలించారు.అలాగే ఎర్ర మంజిల్‌ ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో అసెంబ్లీ భవనం ఇక్కడే నిర్మిస్తే ట్రాఫిక్‌ సమస్య తీవ్రమయ్యే ఛాన్స్ ఉందంటూ రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.మరోవైపు ఎర్రమంజిల్ పటిష్టత, ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ వంటి సమస్యలపై సీనియర్‌ ఆర్కిటెక్ట్‌లతో కూడిన ఇన్‌ట్యాక్‌ నిపుణుల కమిటీ పరిశీలించింది. ఇప్పటికే ఎర్రమంజిల్ పై కోర్టులో కేసు వేసిన ఇన్ ట్యాక్ పూర్తి అధ్యయనం చేసి నివేదికను హైకోర్టుకు సమర్పించాలని భావిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos