గుంటూరు : ‘కోడెల, యరపతినేని, పుల్లారావు, ఆంజనేయులు బాధితులతో బుధవారం ఛలో ఆత్మకూరు ఆందోళన చేపట్టనున్నట్లు వైకాపా నేత అంబట రాంబాబు మంగళవారం ఇక్కడ జరిగిన పలనాడు ప్రజాప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. బుధవారం ఉదయం 9 గంటలకు గుంటూరు వైకాపా కార్యాలయం నుంచి ‘ఛలో ఆత్మకూరు’ మొదల వుతుందని వివరించారు. ‘తెదేపా శిబిరంలోని వారంతా పారితోషిక కళాకారులే. గ్రామాల్లో జరిగిన చిన్నచిన్న గొడవల్లో మా ప్రమేయం ఉందని చంద్ర బాబు నాయుడు ఆరోపించడం దారుణం. గుంటూరు జిల్లాలో చాలా వరకు కక్షలు తగ్గింది. వాస్తవాలు గ్రహించాలని ప్రజలను కోరుతున్నామ’న్నారు. ‘చంద్ర బాబు నాయుడుకు కేవలం 23 సీట్లు వచ్చినా బుద్ధి రాలేదు. మా ప్రభుత్వంపై అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నారు. గతంలో వైకాపా నేతలపై దాడులు జరిగినపుడు ఏమైంది మీ లా అండ్ ఆర్డర్ అని ప్రశ్నిస్తున్నా. ఛలో ఆత్మకూరులోని తెదేపా బాధితులకు బాబు సమాధానం చెప్పాల’ని లోక్సభ సభ్యుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు. తెదేపా గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వైకాపా సానుభూతి పరుల్ని వేధించారని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మా నాయుడు విమర్శించారు. బు ఇప్పటికైనా కుటిల రాజకీయాలు మార్చుకోవాలని హితవు పలికారు. ప్రజలు చల్లగా ఉంటే ఆయనకు కడుపు మంట అని చురక లంటించారు.