శ్రీకాకుళం : అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచే ఆదిత్యుడి దర్శనం కోసం భక్తులు పొటెత్తారు. స్వామివారికి దేవాలయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వినయ్ చంద్ పట్టు వస్త్రాలను సమర్పించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గౌతు శిరీష తదితరులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం నాలుగు వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పించనున్నారు. అరసవల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు.