ప్రపంచ శాంతిని కోరేదే క్రిస్మస్

ప్రపంచ శాంతిని కోరేదే క్రిస్మస్

నెల్లూరు: క్రైస్తవం అంటే శాంతికి ప్రతి రూపం అని లోక్‌సభ సభ్యుడు ఆదాల ప్రభాకర రెడ్డి అన్నారు. ఇక్కడి వెంగళ్ రావు నగర్ లో భారీ ఎత్తున జరిగిన క్రిస్‌మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ‘క్రైస్తవులు ప్రపంచమంతా శాంతి నిండాలని కోరుకుంటారు. క్రైస్తవం అంటే శాంతికి ప్రతిరూపం. ఏసుప్రభు  కరుణాకటాక్షాలు అందరిపై  ప్రసరించాలి. సమాజం మొత్తం సుఖశాంతులతో నిండి పోవాల’ని అభిలషించారు. స్వర్ణ వెంకయ్య తన ఆర్థిక స్థోమతకు మించి గత కొన్ని దశాబ్దాలుగా క్రిస్‌మస్‌  వేడుకల్ని నిర్వహిస్తుండటం  ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత కాలం కొనసాగించేందుకు దేవుడు ఆయనకు ఆయురా రోగ్యాలు చేకూర్చాలని ఆశించారు. కొన్ని వందల మందికి దుప్పట్ల పంపిణీ చేసారు.  ఆహుతుల్ని వెంకయ్య సన్మానించి  జ్ఞాపి కలను ప్రదానం చేశారు. అంతకుముందు ప్రభాకర్ రెడ్డి క్రిస్మస్ కేక్ను కట్ చేసి స్వర్ణ వెంకయ్యకు తినిపించారు.  మైనార్టీ నేత  అబు బకర్ తనయుడు సయీద్  నవాజ్ జన్మదినాన్ని పురస్కరిం చు కొని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ చిరంజీవికి కేక్ తిని పిం చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos