దక్షిణాదికి మొత్తం ఎన్టీఆరే…

  • In Film
  • February 21, 2019
  • 185 Views
దక్షిణాదికి మొత్తం ఎన్టీఆరే…

దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో వాణిజ్య ప్రకటనల ఒప్పందాల్లో ప్రిన్స్‌
మహేశ్‌బాబు మొదటిస్థానంలో కొనసాగుతున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో ఏ హీరో కూడా
మహేశ్‌బాబు నటించిన వాణిజ్య ప్రకటనల్లో నటించలేదు.అలా మహేశ్‌బాబు వాణిజ్య ప్రకటనల్లో
దూసుకుపోతుండగా ఎన్టీఆర్‌ ఇప్పుడిప్పుడే జోరు పెంచుతున్నాడు.ఇప్పటికే పలు వాణిజ్య సంస్థలకు
ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్‌ తాజాగా పార్లె ఆగ్రోతో పెద్ద ఒప్పందంపై సంతకం
చేసాడు.పార్లె సంస్థ తయారు చేస్తున్న యాప్పి శీతల పానీయానికి ప్రచాకర్తగా వ్యవహరించడానికి
ఒప్పందం చేసుకున్నాడు.దక్షిణాది రాష్ట్రాలన్నిటికి కలిపి ఎన్టీఆర్‌నే ప్రచాకర్తగా పార్లె
సంస్థ ఒప్పందం చేసుకుంది.దక్షిణాది రాష్ట్రాల్లో తమ ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకోవాలనే
ఉద్దేశంతో మైసూరు,చెన్నై,హైదరాబాద్‌ నగరాల్లో ఉత్పత్తి విభాగాలు కూడా ప్రారంభించింది.
ఒప్పందంపై ఎన్టీఆర్‌ మాట్లాడుతూ..తనకు ఎంతో ఇష్టమైన యాప్పఫిజ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించనుండడం
సంతోషకరంగా ఉందన్నారు.ఎన్టీఆర్ ఇప్పటికే సెలెక్ట్ మొబైల్స్, బోరో ప్లస్, నవరత్న లాంటి
సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పార్లే ఆగ్రో సంస్థ మరో
ఉత్పత్తి అయిన ఫ్రూటీకి అల్లు అర్జున్, అలియా భట్ ప్రచారకర్తలుగా ఉన్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos