అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులు ఆలస్యంగా విధులకు వస్తే ఆ రోజును సెలవు దినంగా పరిగణిస్తామని ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఉదయం 10 గంటలకు కార్యాలయాలకు రావాల్సిన ఉద్యోగులు 10 నిమిషాల వరకు ఆలస్యమైతే ఫరవా లేదు గానీ.. అంతకు ఒక్క నిమిషం లేటైనా సెలవు పడిపోతుంది. 10.10 – 11 గంటల మధ్యలో కార్యాలయానికి వచ్చేందుకు నెలకు మూడు పర్యాయాలు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ పరిమితి దాటితే వేతనంలో కోత పెడతారు. దీనిపై ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.