ఇసి ఆదేశిస్తే ఆ ఓట్లను తొలగిస్తాం

 హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగిన వారు 30 లక్షల మంది ఉన్నారని రాష్ట్ర  ఎన్నికల ప్రధాన అధికారి  గోపాలకృష్ణ ద్వివేది  శుక్రవారం  ఇక్కడ మాధ్యమ ప్రతినిధులకు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ ముప్పయి లక్షల మంది ఓటు హక్కు
కలిగి ఉన్నారని రాజకీయ పక్షాలు చేసిన ఫిర్యాదు పై  ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు. ఏప్రిల్‌ 11న
 రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున
 రెండు చోట్లా హక్కును వినియోగించుకునే
అవకాశం ఉందన్నారు.  కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిస్తే
 ఆ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని
ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos