
అమరావతి: ఆంధ్రప్రదేశ్ 136 విధానసభ నియోజకవర్గాల అభ్యర్థులతో తొలి జాబితాను సోమవారం సాయంత్రం లేక మంగళవారం విడుదల కానుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు సోమవారం ఇక్కడ తెలిపాయి.రెండు రోజుల పాటు ఢిల్లీ నేతలతో రాష్ట్ర ప్రముఖులు మంతనాలు జరిపి అభ్యర్థుల్ని ఖరారు చేసారు. సాయంత్రంలోగా ఆంధ్రప్రదేశ్లోని 13 లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో మిగిలిన తొమ్మిది స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యే అవకాశాలున్నాయి.