ప్రభుత్వోద్యోగులకు తీపి కబురు

ప్రభుత్వోద్యోగులకు తీపి కబురు

అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుంచి వారికి పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించనుంది. ఈ మేరకు ఫైనాన్స్, ట్రెజరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ట్రెజరీ సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన రెండు నెలల బకాయిలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos