తెలంగాణ విద్యుత్ సంస్థలు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు..

తెలంగాణ విద్యుత్ సంస్థలు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు..

ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పోలీసులు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసుల మధ్య జరిగిన మాటల యుద్ధం,శీతల సమరం రెండు రాష్ట్రాల విద్యుత్‌ సరఫరా సంస్థలకు కూడా పాకింది.బకాయిలు చెల్లించడం లేదంటూ తెలంగాణ ట్రాన్స్‌కో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలపై ఆరోపణలు గుప్పించింది.ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలకు తెలంగాణ విద్యుత్‌ సంస్థలు రూ.5వేల కోట్లు బకాయి పడ్డాయంటూ చేస్తున్న ప్రచారాలు అవాస్తవాలంటూ తెలంగాణ ట్రాన్స్‌కో ఎండీ ప్రభాకరరావు స్పష్టం చేశారు.

వాస్తవంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల మధ్య రూ.5,785 కోట్లు ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉండేదన్నారు.ఈ క్రమంలో తెలంగాణ డిస్కంలు ఆంధ్రప్రదేశ్‌ జెన్‌కోకు రూ.3,379 కోట్లు చెల్లించారన్నారు.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ విద్యుతు సంస్థలే తెలంగాణ ట్రాన్స్‌కోకు రూ.2,406 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.ఏపీ డస్కమ్స్‌ నుంచి రూ.1,659 కోట్లు,ఏసీ జెన్‌కో్ నుంచి రూ.3,096 కోట్లు,ఏపీ ట్రాన్స్‌కో నుంచి రూ.100 కోట్లు,కృష్ణపట్నం పవర్‌ప్లాంట్‌ నుంచి పెట్టుబడుల రూపంలో రూ.929 కోట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలు తెలంగాణ జెన్‌కోకు చెల్లించాలన్నారు.అయితే ఇప్పటి వరకు తెలంగాణ ట్రాన్స్‌కోకు బకాయిలు చెల్లించలేదన్నారు.రెండు రాష్ట్రాల జెన్‌కోల మధ్య నెలకొన్న సందిగ్ధతలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రభాకర్‌రావు తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి,అధికారులకు మధ్య సమాచారలోపం తలెత్తిందని అందుకే పొంతనలేని లెక్కలు చెబుతూ ఆరోపణలు చేస్తున్నారన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos