90% మంది మంత్రులకు పదవీ గండం

90% మంది మంత్రులకు పదవీ గండం

అమరావతి : మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్టు వైసీపీ వర్గాల బోగట్టా. మంత్రివర్గ ప్రక్షాళనకు జగన్ ఇప్పటికే ఒక విధానాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ‘మంత్రి వర్గం రెండున్నరేళ్లే ఉంటుంది. ఆ తర్వాత కొత్తవారికి అవకాశం ఇస్తామ’ని సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్నపుడే ప్రకటించారు. దీని ప్రకారం ఇప్పుడున్న మంత్రల్లో 90 శాతం మంది తమ పదవుల్ని కోల్పోనున్నారు. చాలా మంది ఆశావ హులు పదవుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. పదవులు పోయిన వారికి జిల్లాల ఇన్ చార్జి బాధ్యతలు అప్పగిస్తామని, పార్టీ కోసం పని చేయాలని ఇదివరకే జగన్ సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos