నిశ్శబ్దంలో అనుష్క ఫస్ట్‌లుక్‌..

  • In Film
  • September 11, 2019
  • 223 Views
నిశ్శబ్దంలో అనుష్క ఫస్ట్‌లుక్‌..

భాగమతి అనంతరం చాలా విరామం తీసుకున్న అనంతరం అనుష్క శెట్టి నటిస్తున్న నిశ్వబ్దం చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఒకస్థాయిలో ఉన్నాయి.ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్న నిశ్శబ్దం సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.చిత్రంలో అనుష్క ఫస్ట్ లుక్‌ను బుధవారం చిత్ర బృందం విడుదల చేసింది. పెయింట్ వేస్తూ అనుష్క చాలా క్యూట్ గా కనిపిస్తోంది.ఆర్ట్ బ్యాక్ డ్రాప్ లో అనుష్క తెరపై సరికొత్త థ్రిల్ ని కలిగించనుందని సమాచారం. అయితే పోస్టర్ లో అనుష్క పాత్ర ‘సాక్షి మ్యూట్ ఆర్టిస్ట్’ అనే లైన్ ఇవ్వడంతో అనుష్క పాత్రకు మూగ, చెవుడు అని అర్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ లో మాధవన్ అలాగే హాలీవుడ్ యాక్టర్ మైకేల్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ,హిందీ భాషల్లో సైతం విడుదల కానుంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos