న్యూ ఢిల్లీ: భారత నావికాదళం శుక్ర వారం చేపట్టిన నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్) ప్రయోగం విజయవంతమైంది. క్షిపణి కార్వెట్ ఐఎన్ఎస్ కోరా నుంచి బంగాళాఖాతంలో గరిష్ఠ దూరంలో ఉంచిన నౌక లక్ష్యంగా ప్రయోగించారు. క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు నావికాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు.