న్యూ ఢిల్లీ: మాజీ మంత్రి, తెదేపా నేత ఆదినారాయణ రెడ్డి సోమవారం ఇక్కడ భాజపా కార్యాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పు కు న్నారు. ఆదినారాయణరెడ్డి 2014 విధానసభ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. . అనంతరం తెదేపాలో చేరి మంత్రి పదవిని చేపట్టారు. 2019లోక్సభ ఎన్నికల్లో కడప నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత విధానసభ ఎన్నికల తర్వాత ఆయన తెదేపాతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారు. ఇటీవల భాజపాలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లినా ఆయన కోర్కె ఈడేరలేదు. కడప జిల్లాలో తెదే పాలో కీలకనేతగా ఉన్న ఆయన భాజపాలోకి ఫిరాయించటంతో ఆ పార్టీ ఉనికి, మనికి ప్రమాదంలో పడింది.