ఏపీలో హిందూ ఆలయాలపై కొనసాగుతున్న దాడులు..

ఏపీలో హిందూ ఆలయాలపై కొనసాగుతున్న దాడులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నామని చెబుతున్న రాష్ట్రంలో హిందూ ఆలయాలు,వస్తువులపై దాడులు,వికృత చర్యలకు అడ్డుకట్ట పడడం లేదు కదా పైగా రోజురోజుకు పెరుగుతున్నాయి.తాజాగా రాజమండ్రిలో హిందువులకు ఆరాధ్య దైవమైన వినాయకుడి విగ్రహంపై దుండగులు పైశాచికత్వం ప్రదర్శించారు.తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ వెంకటగిరిలో కొందరు దుండగులు వినాయకుడి విగ్రహానికి మలం పూసి అపచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు గణేష్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. అలాగే నిందితులను శిక్షించాలని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనపై పోలీసుల అధికారులతో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు.అలాగే వెంకటగిరిలో వినాయకుడి విగ్రహానికి మలం పూసిన ఘటనలో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ రవికుమార్ వెల్లడించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లతో ఆధారాలు సేకరించామన్నారు. ఈ ఘటనపై ఎవరైనా సోషల్‌ మీడియాలో పోస్టులు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు.ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు. ‘‘ఇది దురదృష్టకర సంఘటన. విగ్రహాలపై ఇలాంటి దాడులు చేయడం నిచాతినీచమైన చర్య. ఇలాంటివి చేసి సైకో ఆనందం పొందడం మనిషి అన్న వాడికి సాధ్యపడదు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటగిరి, మునసబు గారి వీధిలో మల విసర్జన విగ్రహానికి పుశారు. హిందువుల మనోభావాలే కాదు మనిషి అన్నవాడు ఎవరూ సహించరు.మత విద్వేషాలు రెచ్చగొట్టే వారు దేశ ద్రోహులుగా మిగిలిపోతారు. వెంటనే ఈ అమానుష చర్యకు పాల్పడిన వారిని శిక్షించాలని పోలీసులను కోరడం జరిగింది.’’ అని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.ఇదిలా ఉంటే తాాజాగా విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో సాయిబాబా విగ్రహం ధ్వంసం చేశారు. శ్రీ షిర్డీసాయిబాబా మందిరం బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచార మిచ్చారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సీఐ సురేష్ రెడ్డి సంఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos