అధికార తెలుగుదేశం పార్టీకి మరో గట్టిషాక్ తగలి సూచనలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరున్నట్లు వస్తున్న వార్తలు తెలుగుదేశం పార్టీని కలవరపెడుతున్నాయి.కోనసీమ ప్రాంతం అభివృద్ధికి ఎంతో కృషి చేసామని అయితే తెదేపాలోని కొంతమంది తమకు తగినంత గుర్తింపు,పేరు రాకుండా అడ్డుపడుతున్నారంటూ రవీంద్ర కొద్ది కాలంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.దీంతోపాటు త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అమలాపురం సీటు ఇచ్చే విషయమై తెదేపా అధినేత చంద్రబాబు ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోడం కూడా రవీంద్రలో అసహనం పెరగడానికి కారణంగా తెలుస్తోంది.కోనసీమకు ఈ పరిణామాలన్నింటితో విసుగు చెందిన రవీంద్ర వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఎన్నికలు ఎంతో దూరం లేకపోవడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయరాదని భావించిన రవీంద్ర వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారని అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం వైసీపీ అధినేత జగన్‌తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి రవీంద్ర తమతో కలవబోతున్నారని వైసీపీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి చాన్నాళ్లుగా చెబుతున్నారు. రవీంద్ర మాత్రం ఇన్నాళ్లూ ఈ విషయంపై స్పందించలేదు.వైసీపీ అధినేత జగన్ నుంచి ఏదైనా స్పష్టమైన హామీ దక్కాక ఈవిషయంపై స్పందిస్తారేమో చూడాలి..2014 లో రవీంద్రబాబు వైసిపి అభ్యర్ది పి విశ్వరూప్ పై గెలుపొందారు. ఆ ఎన్నికల్లో రవీంద్ర బాబుకు 594547 ఓట్లు రాగా, వైసిపి అభ్యర్దికి 473971 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది రవీంద్రబాబు 120576 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రవీంద్రబాబు వైసిపి లో చేరితే ఎంపీగా అవకాశం ఇస్తారా..ఎమ్మెల్యే గా పోటీ చేయిస్తారా అనేది జగన్ తో సమావేవమైన సమయంలోనే స్పష్టత వస్తుందని చెబుతున్నారు. రవీంద్ర కు వైసిపి నుండి అమలాపురం ఎంపీగా అవకాశం ఇస్తే..విశ్వరూప్ ను అమలాపురం ఎమ్మెల్యేగా బరిలో దించే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. విశ్వరూప్ గతంలో రెండు సార్లు అమలాపురం నుండి గెలిచిన మంత్రిగా పని చేసారు. అయితే, వైసిపి లో చేరుతున్న పి రవీంద్రబాబును విశాఖ జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే అభ్యర్దిగా జగన ప్రకటిస్తారని సమాచారం.