తెరాస గూటికి మరో ఎమ్మెల్యే?

తెరాస గూటికి మరో ఎమ్మెల్యే?

తెలంగాణలో తెరాసలోకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వలస వెళుతుండడాన్ని గమనిస్తే త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్‌ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పటికే ఐదు మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో చేరనున్నామంటూ ప్రకటించగా తాజాగా నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ కూడా తెరాసలో చేరనున్నట్లు తెలుస్తోంది.ఈనెల19వ తేదీన నిజామాబాద్‌ జిల్లాలో జరిగే బహిరంగ సభలో తెరాస అధినేత కేసీఆర్‌ సమక్షంలో సురేందర్‌ తెరాసలో చేరనున్నట్లు సమాచారం.ఇప్పటికే ఆత్రం సక్కు,చిరుమర్తి లింగయ్య,హరిప్రియ నాయక్‌,రేగా కాంతారావు,పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డిలు తెరాసలో చేరడానికి సిద్ధమైపోగా సురేందర్‌ కూడా అదే బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది.వీరితో పాటు మరికొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాస వైపు చూస్తున్నట్లు సమాచారం.ముఖ్యంగా కాంగ్రెస్‌ మహిళ సీనియర్‌ నేత సబిత ఇంద్రారెడ్డి కూడా తెరాసలో చేరడానికి సిద్ధమవడం కాంగ్రెస్‌ను తీవ్రంగా కలవరపెడుతోంది.తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెదేపాతో కలసి పోటీ చేసిన కాంగ్రెస్‌ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది.తెలంగాణలో తమ పార్టీ ఉనికి కూడా లేదని తెలిసినా తెదేపా అధినేత చంద్రబాబు అత్యాశాకుపోయి కాంగ్రెస్‌తో కలసి పోటీ చేశాడు.కాంగ్రెస్‌ కూడా చంద్రబాబుపై గుడ్డినమ్మకంతో తెదేపాతో కలసి పోటీ చేయడానికి అంగీకరించింది.దీంతో 20కి మించి స్థానాలు గెలుచుకోలేక చతికిలపడింది.కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా తెరాసలో చేరుతుంటే చూస్తుండడం మినహా ఏమి చేయలేక ఉనికి కోల్పోయే దుస్థితికి చేరవవుతోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos