చెన్నై: ‘‘మీడియాను నియంత్రిస్తాం. రాబోయే ఆరు నెలల్లో పూర్తిగా మన చెప్పుచేతుల్లోకి తెచ్చుకోబోతున్నాం. ఎవరూ బాధపడకండి. నిరాధారమైన వార్తలు ఎల్లకాలం మనల్ని ఇబ్బంది పెట్టలేవు. మన పార్టీ మాజీ అధ్యక్షుడు సమాచార ప్రసార శాఖ మంత్రి అయ్యాడు. అన్ని పత్రికలూ ఆయన కిందే ఉంటాయి. తప్పులు ఎల్ల కాలం జరగవు. వాటితో ఎల్లకాలం మీరు రాజకీయాలు చేయలేరు’ అంటూ భాజపా అధ్యక్షుడు అన్నామలై మాట్లాడిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతొంది.. కొయంబత్తూరు నుంచి చెన్నైకి కార్యకర్తలతో కరోనా కాలంలో పర్యటించటం అధికారులకు పెద్ద తలనొప్పి అయ్యింది. పత్రికలు ఆయన పర్యటనను విమర్శించాయి. తమిళనాడు బీజేపీ అధ్య క్షుడుగా పని చేసిన ఎల్ మురుగన్ ఇటీవల సమాచార ప్రసార సహాయ మంత్రిగా బాద్యతల్ని చేపట్టారు. ఈ వ్యాఖ్యల్ని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి మనో త్యాగరాజన్ ఖండించాడు. పరిణితి లేని వ్యాఖ్యలని మండిపడ్డాడు. మాద్యమాలు ఏ ఒక్క పార్టీ సొత్తో కాదని, ఆయన అలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదన్నారు. తాను ‘ఫేక్ న్యూస్ కట్టడి’, రాబోతున్న ఐటీ యాక్ట్ గురించి ఉద్దేశించి అలా మాట్లాడనని.. మీడియాను పార్టీ నియంత్రిస్తుందన్న కోణంలో తాను మాట్లాడలేదని అన్నామలై స్పష్టం చేశారు.