హొసూరులో జోరుగా అన్నదానాలు

హొసూరులో జోరుగా అన్నదానాలు

హొసూరు : చంద్ర చూడేశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం హొసూరులో పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి ఏటా జోరుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా పట్టణ పరిధిలోని జూజువాడి, తేరుపేట, పెరియార్ నగర్ తదితర ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలను విరివిగా నిర్వహించారు. జూజువాడి మాజీ కౌన్సిలర్ అశోక్ రెడ్డి అధ్యక్షతన అన్నదానం, మజ్జిగ విరివిగా పంచిపెట్టారు.

చంద్ర చూడేశ్వర స్వామి రథోత్సవంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం వల్ల వారికి అసౌకర్యం కలుగకుండా అన్నదానాలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నారాయణ రెడ్డి, శ్రీధర్, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos