రేపటి నుంచి అన్నా హజారే నిరాహార దీక్ష

రేపటి నుంచి అన్నా హజారే నిరాహార దీక్ష

అహ్మదాబాద్: రైతుల డిమాండ్లపై తాను చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెడుతోందంటూ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరికి నిరసనగా శనివారం  నుంచి తాను నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. ‘రైతులకు న్యాయం చేయాలంటూ నాలుగేళ్లుగా తాను పోరాటం చేస్తున్నా.గత మూడు నెలల్లోనే ఐదు సార్లు ప్రధానమంత్రి, వ్యవసాయ మంత్రికి లేఖలు రాశా. ‘అయినా రైతుల సమస్యలపై కేంద్ర తగిన నిర్ణయం తీసుకుంటున్నట్టు కనిపించ లేదు. రైతులు కష్టాల పట్ల ఈ ప్రభుత్వానికి కనీసం కనికరం లేదు. కాబట్టి నేను మహాత్మా గాంధీ హత్యకు గురైన రోజును పురస్కరించుకుని జనవరి 30 నుంచి రాలెగావ్-సిద్ధిలోని యాదవ్‌బాబా ఆలయం వద్ద నిరాహార దీక్ష ప్రారంభిస్తాను…’’ అని హజారే పేర్కొన్నారు.‘కనీస మద్దతు ధర సహా ఇతర సమస్యలపై 2018 మార్చి 23న తాను నిరాహార దీక్ష మొదలుపెడితే.. అదే నెల 29న కేంద్రం ఈ సమస్యలను పరిష్కరిస్తామంటూ రాతపూర్వత హామీ ఇచ్చింది.  హామీని నిలబెట్టుకోక పోవడంతో మళ్లీ 2019 జనవరి 30న మరోసారి దీక్ష చేపట్టా.  అప్పుడూ  కేంద్ర వ్యవసాయ మంత్రితో పాటు నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తనతో చర్చలు జరిపారు. ఆరు గంటల పాటు చర్చలు జరిగిన తర్వాత నాకు మళ్లీ రాతపూర్వక హామీ ఇచ్చారు. ఇంతవరకు తగిన చర్యలు తీసుకోలేదు. హామీ అంటే వాగ్దానం. ప్రభుత్వమే తన మాట నిలబెట్టుకోకపోతే దేశం, సమాజం భవిష్యత్తు ఎలా బాగుపడుతుంది?’’ అని ప్రశ్నించారు. నేటికీ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.  పంటకు తగిన గిట్టుబాటు ధర అందడం లేదు. ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తున్నామని కేంద్రం చెబుతున్నప్పటికీ.. వాస్తవాలు మరోలా ఉన్నాయ’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos