అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలపై ఇడి సోదాలు

అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలపై ఇడి సోదాలు

ముంబయి :  మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఢిల్లీ మరియు ముంబయిలోని రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి చెందిన సంస్థలపై ఇడి గురువారం దాడులు చేపడుతోందని అధికారులు తెలిపారు. భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ రెండు ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆపరేషన్‌లో భాగంగా ఈ కేసుతో సంబంధం ఉన్న 50కి పైగా సంస్థలపై ఇడి అధికారులు దాడులు చేసి రికార్డులను పరిశీలిస్తోంది. 25మందికి పైగా వ్యక్తులను ప్రశ్నిస్తోంది. సుమారు 35 ప్రదేశాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రణాళికాబద్ధంగా మరియు ముందస్తు ఆలోచనతో” రూపొందించిన పథకంతో బ్యాంకులు, వాటాదారులు, పెట్టుబడిదారులు మరియు ప్రభుత్వ సంస్థలను మోసం చేసి ప్రజా ధనాన్ని స్వాహా చేసినట్లు ఇడి ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన సంగతి తెలిసిందే. రుణాలను సులభతరం చేయడానికి యెస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ మాజీ ప్రమోటర్లు సహా సీనియర్‌ బ్యాంక్‌ అధికారులకు లంచం ఇచ్చినట్లు తెలిపింది.2017-2019 మధ్య, యెస్‌ బ్యాంక్‌ రిలయన్స్‌ అనిల్‌ అంబానీ గ్రూప్‌ కింద ఉన్న ఆర్‌ఎఎజిఎ కంపెనీలకు సుమారు రూ.3,000 కోట్ల రుణాలను మంజూరు చేశారని పేర్కొంది. యెస్‌ బ్యాంక్‌ ప్రమోటర్లు రుణాలు మంజూరు చేయడానికి ముందు వారి ప్రైవేట్‌ ఆధీనంలో ఉన్న కంపెనీల్లో చెల్లింపులను తీసుకునేందుకు వీలుగా చట్టవిరుద్ధమైన క్విడ్‌ ప్రోకో జరిగినట్లు ఇడి స్పష్టం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos