జబర్దస్త్‌తో
పాటు పలు చిత్రాల్లో హాట్‌హాట్‌గా కనిపించి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన యాంకర్,నటి
రష్మి ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.కొద్ది
రోజుల క్రితం కొత్తగా కొన్న కారులో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విశాఖ సమీపంలోని
కూర్మన్నపాళెం వద్ద వెళుతుండగా కారు అదుపు తప్పి పాదచారిని ఢీకొట్టినట్లు సమాచారం.ఘటనలో
తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని ప్రస్తుతం అతడు విశాఖలోని ఓ ప్రైవేటు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగాక రష్మి అక్కడి నుంచి
మరొక వాహనంలో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన సమయంలో కారు ఎవరు నడిపారనే
విషయం పోలీసుల విచారణలో తేలనుంది.ప్రమాదం గురించి అటు రష్మి కానీ ఇటు పోలీసులు కానీ
స్పందించలేదు.ఒకవేళ కారు నడిపింది రష్మినే అయితే చట్టపరంగా రష్మి చర్యలు ఎదుర్కోక తప్పదు..