పవన్‌ కళ్యాణ్‌ హీరోయిన్‌పై చీటింగ్‌ కేసు..

  • In Film
  • March 30, 2019
  • 163 Views
పవన్‌ కళ్యాణ్‌ హీరోయిన్‌పై చీటింగ్‌ కేసు..

బాలీవుడ్‌ నటి
అమీషా పటేల్‌పై చీటింగ్‌ నమోదైంది.సినిమా తీస్తామని నమ్మించి నటి అమీషాపటేల్‌తో ఆమె
బిజినెస్‌ పార్టనర్‌ తనను రూ.2.5 కోట్ల మేర మోసం చేశారంటూ అజయ్‌ కుమార్‌సింగ్‌ అనే
వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశి మ్యాజిక్‌ పేరుతో సినిమా తీస్తామని సినిమా
భారీగా లాభాలు తెస్తుందని మూడు నెలల్లో డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటూ అమీషాపటేల్‌ ఆమె
బిజినెస్‌ పార్టనర్‌ కూనాల్‌ గ్రూమర్‌లు గత ఏడాది చివరలో రాంచీలో తన నుంచి రూ.2.5 కోట్లు
తీసుకున్నారని బాధితుడు అజయ్‌ పేర్కొన్నాడు.రోజులు గడుస్తున్నా సినిమా తీయకపోవడంతో
డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ అడగగా తప్పించుకు తిరుగుతున్నారంటూ ఆరోపించాడు.డబ్బులు
చెల్లించాలంటూ ఒత్తిడి చేయగా రూ.3 కోట్ల చెల్లని చెక్కు ఇచ్చారని ఇలా పలుమార్లు చెల్లని
చెక్కులు ఇచ్చి మోసం చేశారంటూ ఆరోపించాడు.డబ్బుల కోసం ఒత్తిడి తీవ్రతరం చేయడంతో డబ్బులు
ఇచ్చే ఉద్దేశం లేదని దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడ్డారంటూ అజయ్‌ ఆరోపించాడు.దీంతో
తనకు న్యాయం చేయయాలంటూ రాంచీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశానని బాధితుడు అజయ్‌ తెలిపాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos