అమరావతి: అంబేద్కర్ గుర్తుగా ఏపీలో 125 అడుగులు ఎత్తైన విగ్రహన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మెరుగ నాగార్జున బుధవారం శాసనసభలో ప్రకటించారు. కుల వివక్షకు వ్యతిరేఖంగా బాబా సాహేహ్ అంబేద్కర్ పోరాడారని అన్నారు. 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును టీటీపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అంబేద్కర్ విగ్రహం అమరావతి ప్లాన్లో ఉందా అని అడిగారని… అయితే ముళ్ల పోదల్లో ఏర్పాటుకు ప్రయత్నించారని చెప్పారు. ఆ విగ్రహన్ని చాలా తక్కువ ప్లేస్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. కాస్య విగ్రహం కాకుండా సిమెంటు విగ్రహం పెట్టాలని చూశారన్నారు. తాము ఎవ్వరం జగన్మోహన్ రెడ్డిని అంబేద్కర్ విగ్రహం కావాలని అడగలేదని.. ముఖ్యమంత్రే విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం పెడదామన్నారని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటుకు జీవో ఇచ్చారని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ లైబ్రరీని కూడా స్వరాజ్ మైదాన్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం ప్రారంభం రోజు రాష్ట్రంలోని అన్ని ఊళ్ల నుంచి బస్సులు పెట్టాలని కోరుతున్నామని.. దేశంలోని సీఎంలను అందరిని పిలిపించాలని కోరుతున్నామన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం, జీవిత చరిత్ర స్కూలు పిల్లలకు చూపించాలన్నారు. అదే ప్రాంతంకు గాంధీగారు కూడా వచ్చారని… అక్కడ విగ్రహం పెట్టడం గొప్పవిషయమని చెప్పారు.