రాయుడు పునరాగమనం!

  • In Sports
  • August 24, 2019
  • 152 Views
రాయుడు పునరాగమనం!

క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ కొద్ది కాలం క్రితం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దిశగా భారత మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు అడుగులు వేస్తున్నాడు.టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్‌ జట్టుకు ఆడుతున్నాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ భారత్‌ తరుఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌‌తో పాటు ఐపీఎల్ ఆడాలని భావిస్తున్నట్టు తెలిపాడు. వరల్డ్‌కప్ కోసం 4,5 ఏళ్లు తీవ్రంగా శ్రమించా. అయినా జట్టులో చోటు లభించకపోతే నిరాశ చెందడం సహజం. అప్పుడు అలాంటి నిర్ణయం తీసుకున్నా. ఆ తర్వాత మళ్లీ ఆలోచించా. తిరిగి భారత్‌ తరపున ఆడాలని తపిస్తున్నా” అని అన్నాడు. వరల్డ్‌కప్‌లో టోర్నీలో శిఖర్‌ ధావన్‌, విజయ్ శంకర్‌ గాయపడ్డా బ్యాకప్‌గా ఉన్న రాయుడిని ఎంపిక చేయకుండా అతడి స్థానంలో మయాంక్‌ను ఇంగ్లాండ్‌కు పిలిపించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రాయుడు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos