అమరావతి: బాలకృష్ణ, నారా లోకేశ్ లను వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు హేళన చేసారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘బాలకృష్ణ అసమర్థుడు, అమాయకుడు. నారా లోకేశ్ ఒక హాస్య నటుడు వంటి వాడు. ఎన్టీఆర్ కు పొడిచిన వెన్నుపోటు రక్తపు మరకలను తుడిచేసుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. స్వార్థం కోసమే బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్’లో చంద్రబాబు పాల్గొన్నార’ని విమర్శించారు. లోక కల్యాణం కోసమే ఎన్టీఆర్ ను దించేశారా అని ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారు. ఎన్టీఆర్ బతికే ఉంటే మీ పరిస్థితి ఏమిటి? అని అడివగారు. అమరావతి రైతుల పాదయాత్ర ఫేక్ యాత్ర. దాన్ని చూసి ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యవంతమయ్యారని చెప్పారు. టీడీపీ చేసిన తప్పిదాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.