సైన్యం సొమ్ము అంబానీ జేబులోకి

సైన్యం సొమ్ము అంబానీ జేబులోకి

కోరాపుట్‌: దేశ రక్షణ బలగాల సొమ్మును ప్రధాని మోదీ తన సన్నిహితుడు అనిల్‌ అంబానీకి దోచి పెడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు.ఒడిశా, కోరాపుట్‌లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘భారత వాయు సేన ఇటీవల పాక్‌ ఉగ్రవాద శిబిరంపై దాడులు చేపట్టిందని, మన సైనికులూ వీరమరణం పొందారని’  ఎద్దేవా చేసారు. ప్రధాని మోదీ దేశభక్తి గురించి లెక్కలేకుండా ఉపన్యాసాలు చేస్తూ ప్రజల సొమ్మును ప్రయివేటు వ్యక్తులకు ధారా దత్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత ఏడు దశాబ్ధాలుగా ప్రభుత్వ రంగ హిందుస్తాన్‌ ఏరో నాటిక్స్‌ లిమిటెడ్‌  (హెచ్‌ఏఎల్‌) వాయు సేనకు యుద్ధవిమానాల్ని ఉత్పత్తి చేస్తున్నా రాఫెల్‌ యుద్ధ విమానాల తయారీ అనిల్‌ అంబానీకి మాత్రమే దక్కేలా నరేంద్ర మోదీ ఒప్పందాన్ని ప్రభావితం చేసారని దుయ్య బట్టారు. తన కార్పొరేట్‌ సన్నిహితులకు ప్రజల ఆస్తుల్ని  దోచిపెట్టడం మోదీకి అలవాటని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos