అంబాలా: అత్యాధునిక ఐదు యుద్ధ విమానాలు – రాఫెల్ గురువారం ఇక్కడ లాంఛన ప్రాయంగా వాయు సేన బలగాల్లో చేరాయి. దీనికి సూచనగా ఇక్కడి వైమానిక స్థావరంలో రాఫెల్ యుద్ధ విమానాలకు భారత రక్షణ శాఖ సర్వ ధర్మ పూజలు నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ విమానాలు గోల్డెన్ యారోస్లోకి 17వ స్క్వాడ్రన్లో చేరాయి.