న్యూ ఢిల్లీ : ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇక ఎంతమాత్రమూ కాంగ్రెస్లో కొనసాగబోనని తేల్చి చెప్పారు. గురువారం ఇక్కడ విలేఖ రుల తో మాట్లాడారు. ‘కొంతకాలంగా పార్టీలో నాకు ఎదురవుతున్న అవమానాలు చాలు. ఇక వాటిని భరించలేను. బీజేపీలో చేరటం లేదు. రైతు సమస్యలపై మాట్లాడేందుకే అమిత్షాను కలిసాను’అని వివరించారు.