రాజధాని మార్పుపై టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు..

రాజధాని మార్పుపై టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని మార్పుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అమరావతిని తరలించే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజెపి అధిష్టానంతో చర్చించారని టీజీ వెంకటేష్ చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క రాజధాని ఉండదని నాలుగు రాజధానాలు ఉండనున్నాయని వ్యాఖ్యానించారు.కాకినాడ, గుంటూరు, విజయనగరం, కడపల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నారని టీజీ వెంకటేష్ చెప్పారు. నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రాంతీయ మండళ్లు కూడా రాజధానుల ఏర్పాటులో భాగంగానే వస్తున్నాయని భావిస్తున్నారు.బహుశా, ప్రస్తుతం అమరావతి నాలుగు రాజధానుల్లో ఒక్కటిగా మారే అవకాశం ఉంది.రాజధాని మార్పుపై మంత్రి బొత్స సత్యానారాయణ కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు అందుకు వైఎస్‌ జగన్‌ సైతం స్పందించకుండా మౌనంగా ఉంటుండగా తాజాగా టీజీ వెంకటేశ్‌ చేసిన వ్యాఖ్యలు రాజధాని మార్పు తథ్యమన్న వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos