వైసీపీలో చేరిన మరో తెదేపా ఎంపీ..

వైసీపీలో చేరిన మరో తెదేపా ఎంపీ..

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ వైసీపీలో చేరనున్నారంటూ
వచ్చిన ఊహాగానాలే నిజమయ్యాయి.ఆదివారం నుంచి వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ
ఎంపీ రవీంద్ర సోమవారం మధ్యాహ్నం వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో వైసీపీలో
అధికారికంగా చేరారు.ఆదివారం రాత్రి అమలాపురం నుంచి బయలుదేరి సోమవారం హైదరాబాద్‌కు
చేరుకున్న రవీంద్ర లోటస్‌పాండ్‌లో జగన్‌తో సమావేశమై కాసేపు చర్చించిన అనంతరం
వైసీపీలో చేరారు.అనంతరం విజయసాయిరెడ్డి,అవంతి శ్రీనివాస్‌లతో కలసి మీడియాతో
మాట్లాడారు.చంద్రబాబు స్వార్థ రాజకీయాల వల్లే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక
హోదా రాలేదని ఆరోపించారు.చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదని తమ
కుటుంబ సభ్యులను,పార్టీ నేతలను అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యత
ఇస్తున్నారని అందుకోసం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసారంటూ ఆరోపించారు.రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్‌ సీపీలో చేరినట్టు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే సత్తా వైఎస్‌ జగన్‌కు మాత్రమే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఏకమై వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని రవీంద్రబాబు కోరారు. పేదరికం పోవాలంటే వైఎస్‌ జగన్ అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు. కులాలవారీగా చంద్రబాబు దగ్గర ఆర్మీ ఉంటుందని, ఏ కులం​ వారితో ఆ కులం వారిని తిట్టిస్తారని చెప్పారు. అమలాపురం ఎంపీ పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసినట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను మీడియాకు చూపించారు. టీడీపీకి కూడా రాజీనామా చేసినట్టు తెలిపారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos