త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో
తెదేపా అభ్యర్థిగా పోటీ చేయడానికి తాను కూడా పోటీలో ఉన్నానంటూ మాజీ మంత్రి
పసుపులేటి బ్రహ్మయ్య తెలిపారు.సోమవారం కడప నగరంలోని హరిత హోటల్‌లో మండల తెదేపా
నేతలతో నిర్వహించిన సమావేశంలో బ్రహ్మయ్య మాట్లాడారు.తెదేపా ప్రభుత్వం అధికారంలో
ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా తమ నియోజకవర్గంలోని అన్ని మండాల్లో పలు అభివృద్ధి పనులు
చేసామని గుర్తు చేసారు.రాజంపేట నియోజకవర్గం అభివృద్ధికి తాము చేసిన కృషిని ప్రజలు
ఇప్పటికీ గుర్తుంచుకున్నారని అందుకే వచ్చే ఎన్నికల్లో తెదేపా తరపున అభ్యర్థిగా
బరిలో దిగడానికి తాము కూడా పోటీలో ఉన్నామన్నారు.తన హయాంలో నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు, గూండాయిజాలు లేవని, ప్రజలకు తొమ్మిది సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశిస్తే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు.రాజంపేట నియోజకవర్గ ప్రజలకు దాహార్తిని తీర్చే అన్నమయ్య ప్రాజెక్టును కూడా అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెప్పి ప్రాజెక్టు నిర్మించామని, చెయ్యేరు నది చుట్టుపక్కల గ్రామాల ప్రజల తాగునీరు, సాగునీటికి ఉపయోగపడుతుందని, దాని అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. రాజంపేట నియోజకవర్గ ప్రజలు మరోసారి టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని, చంద్రబాబునాయుడుని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు ఎస్.వి.రమణ, అడ్వకేటు రామ దాసు, ఎంఎస్‌రెడ్డి, తాతిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తాతిరెడ్డి సుబ్బారెడ్డి, ఈశ్వరయ్య, కొత్తపల్లె ఆంజనేయులు, వెంకటరమణ, పామూరు సుబ్రమణ్యం, నడింపల్లె సుబ్బారెడ్డి, మండ లంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.