
దిల్లీ: ఫిబ్రవరిలో మారుతి సుజుకీకి చెందిన ఆల్టో కారుల ఇతర రకాల కార్ల కంటే ఎక్కువ సంఖ్యలో అమ్ముడయ్యాయి. గత నెల్లో 24,751 ఆల్టో కార్లు విక్రయ మయ్యాయి. కార్ల విక్రయాలపై సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మ్యాను ఫాక్చరర్స్ (సియామ్) అధ్యయనం అమ్మకాల్లో తొలి స్థానంలో ఆల్టో ఉండగా స్విఫ్ట్ రెండో స్థానంలో నిలిచింది. గత నెల 18,224 స్విఫ్ట్ కార్లు అమ్ముడ య్యాయి. బాలెనో(17,944 యూనిట్లు) మూడో స్థానంలో, డిజైర్(15,915 యూనిట్లు) నాలుగో స్థానంలో, వేగానర్ (15,661 యూనిట్లు) ఐదో స్థానంలో, విటారా బ్రెజా(11,613 యూనిట్లు) ఆరో స్థానంలో నిలిచాయి.హ్యుందా య్కు చెందిన ఎలైట్ ఐ20 ఏడో స్థానం, క్రెటా ఎనిమిదో స్థానం, గ్రాండ్ ఐ10 తొమ్మిదో స్థానం దక్కించుకున్నాయి. ఈ సారి టాటామోటార్స్ చెందిన టియాగో 8,286 యూనిట్ల విక్రయాలతో పదో స్థానంలో నిలిచింది.