సామాజిక మాధ్యమాల్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్లలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్,అభిమానులతో పంచుకునే బన్నీతాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇటీవల కొన్న కొత్త రేంజ్‌రోవర్ కారుతో సహా ఫోటోకు ఫోజులిచ్చిన బన్నీ. ‘మా ఇంట్లోకి కొత్త కారు వచ్చింది. దానికి నేను ‘బీస్ట్‘ అని పేరు పెట్టా. నేను ఏ వస్తువు కొన్నా దానిని కృతజ్ఞతగానే భావిస్తా‘ అని బన్నీ ట్వీట్ చేశాడు.బన్నీ ట్వీట్‌పై అభిమానులు,నెటిజన్లు తమదైన శైలిలో కమెంట్లు చేస్తున్నారు..