కరోనా రోగులు పూర్తిగా కోలుకునేవరకు బాధ్యత మాదే

కరోనా రోగులు పూర్తిగా కోలుకునేవరకు బాధ్యత మాదే

మంగళగిరి : కరోనా రోగులు పూర్తిగా కోలుకునేంత వరకు బాధ్యత తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడ విలేఖరులతోమాట్లాడారు. బాధితులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమైనా అందిస్తామని భరోసా ఇచ్చారు. ‘ కరోనా రోగులు పెరుగుతున్నందున పడకల సమస్య తీర్చేందుకు 60 వరకు కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసాం. ఆసుపత్రుల్లో పడకల కోసం డిమాండ్ పెరిగిపోతోంది. అదనంగా 33 వేల పడకల్ని ఏర్పాటు చేస్తున్నాం. తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. తక్కువ లక్షణాలు ఉన్నవారికి కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స జరుపుతున్నాం. ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా చూస్తున్నాం. కేంద్రం సరఫరా చేస్తున్న ఆక్సిజన్ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించాం. రెమ్ డెసివిర్ సూది మందుకు ఏర్పడిన డిమాండ్ ను నియంత్రించాం. బ్లాక్ మార్కెట్ కు తరలివెళ్లడాన్ని అరికట్టగలిగామ’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos