అమరావతి: తిరుపతి రైల్వే స్టేషన్-అలిపిరి మార్గంలోని మద్యం దుకాణాల్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం గురువారం ప్రకటించిన నూతన అబ్కారీ విధానంలో ఈ చర్యను చేపట్టింది. నూతన విధానం ప్రకారం వచ్చే అక్టోబర్ నుంచి పానీయాల సంస్థ 3,500 మద్యం దుకాణాలను నిర్వహించనుంది. దశల వారీ మద్యం నిషేధంలో భాగంగా వీటి సంఖ్యను 800 కు పైగా తగ్గింది.