చరణ్,తారక్‌ల కాంబినేషన్‌లో సుమారు రూ.400 కోట్ల వ్యయంతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రంపై చాలా కాలంగా సామాజిక,ప్రసార మాధ్యమాల్లో వినిపిస్తున్న ఊహాగానాల్లో చాలా వరకు నిజాలుగా తేలాయి.రాజమౌళి స్వయంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వెల్లడించంతో ఊహాగానాలు నిజాలేనని తేలిపోయాయి.అందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ యువనటి అలియాభట్ హీరోయిన్ నటించనుందని వినిపించిన ఊహాగానాలు ముఖ్యమైనవి.రాజమౌళి కథ చెప్పగానే నటించడానికి అంగీకరించిన అలియాభట్ పారితోషకం విషయంలో మాత్రం వెనక్కు తగ్గలేదని సమాచారం.రాజీ చిత్రం విజయం సాధించిన అనంతరం అలియా తన పారితోషకాన్ని భారీగా పెంచినట్లు టాక్.ఈ క్రమంలో ప్యాన్ ఇండియాగా తెరకెక్కనున్న భారీ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించడానికి అలియా రూ.7.5 కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.బాలీవుడ్‌లో అలియాభట్‌కున్న క్రేజ్ బాలీవుడ్‌లో చిత్రం మరోస్థాయికి వెళ్లడానికి దోహదపడుతుందని భావించిన నిర్మాత దానయ్య అంతమొత్తం పారితోషం ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం. చిత్రంలో అలియాభట్ గురించి అధికారికంగా ప్రకటించగానే అలియా ట్విట్టర్‌లో స్పందించారు.ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం గర్వంగా ఫీలవుతున్నా..అద్భుతమైన టీమ్‌తో ఈ జర్నీ ప్రారంభించడానికి చాలా ఆసక్తిఆ ఎదురు చూస్తున్నా థాంక్యూ రాజమౌళి సర్..నాకు ఈ భారీ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు అంటూ ట్వీట్ చేశారు..