బాహుబలి అనంతరం దర్శకధీరుడు రాజమౌళికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది.అందుకు రాజమౌళి ఇద్దరు మాస్ హీరోలు తారక్,చరణ్‌లతో తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌పై తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఒక కన్నేసి ఉంచింది.రూ.300 కోట్ల భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఏచిన్న విషయంలో కూడా రాజమౌళి రాజీపడడం లేదట.భారీ వ్యయంతో నిర్మిస్తున్న చిత్రం కావడంతో తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం వీలైతే కన్నడ భాషల్లో విడుదల చేయడానికి రాజమౌళి ప్లాన్లు వేసినట్లు తెలుస్తోంది.ఇక హీరోయిన్లపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోయినా బాలీవుడ్ నటీమణులు అలియాభట్,పరిణితీ చోప్రాలను హీరోయినన్లుగా తీసుకోవడానికి రాజమౌళి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా అలియాభట్‌ను ఎలాగైనా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో నటింపచేయడానికి గట్టిగా నిర్ణయించుకున్న రాజమౌళి అవసరమైతే పారితోషకం ఎక్కువ ఇస్తామంటూ అలియాభట్‌కు ప్రతిపాదన పంపించారంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు వినిపించాయి. అందుకు అలియాభట్ నుంచి ఊహించని స్పందన వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏడాదికి పైగా తాము వేరే చిత్రాలతో బిజీగా ఉండనున్నామని అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించడం కుదరదంటూ బదులిచ్చిందట.అంతేకాదు పారితోషకం గురించి ఆలోచించి తాము ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించడానికి నిరాకరించాననేది కూడా వాస్తవం కాదని ముందుగా సైన్ చేసిన ప్రాజెక్ట్‌ల వల్ల తిరస్కరించినట్లు బదులిచ్చిందట.పారితోషకం ఎక్కువ వస్తుందని బలవంతంగా చిత్రాల్లో నటించడం తమకు ఇష్టం లేదని కూడా సమాధానమిచ్చిందట.అలియా సమాధానంతో రాజమౌళి అండ్ టీమ్ వేరే హీరోయిన్‌ను వెతుక్కునే పనిలో పడ్డారట.త్వరలో కోల్కతాలో 45 రోజుల భారీ షెడ్యూల్ జరుగనుండడంతో అప్పటిలోగా హీరోయిన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తున్నారట..