హోసూరు : ఇక్కడికి సమీపంలోని సూలగిరి ప్రాంతంలో ఒంటరి ఏనుగు సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోసూరు అటవీశాఖ అధికారులు గ్రామ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. హోసూరు సమీపం లోని పేరండపల్లి అటవీ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా సంచరిస్తున్న ఒంటరి ఏనుగు సూలగిరి సమీపంలోని సెట్టిపల్లి ఆటవీప్రాంతంలోకి చొరబడింది. ఆ ఏనుగు ఆక్రోషంగా ఉన్నందున సెట్టిపల్లి, గొరుగురికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పొలాల వద్దకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, రాత్రి పూట ఒంటరిగా బయటకు ఎవరూ రావొద్దని అటవీశాఖ అధికారులు గ్రామాలలో హెచ్చరికలు జారీ చేశారు.ఒంటరి ఏనుగును తరిమివేసే వరకు సూలగిరి అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సిబ్బంది సూచించారు.